- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం.. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై చర్చ..!
తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు (సోమవారం) నిర్వహించనున్నట్లు సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ (Cabinet meeting) సమావేశం రేపు (సోమవారం) నిర్వహించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3:00 గంటల ప్రాంతంలో సచివాలయంలో కేబినెట్ భేటీ కానున్నట్లు తెలిసింది. తెలంగాణలో (local body elections) స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
అదేవిధంగా కేబినెట్‌లో చర్చించే వివిధ అంశాలపై అవకాశం ఉంది. రైతులకు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. వీటితో పాటు ఎన్నికల ముందు హమీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో గ్యారెంటీని అమలుకు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం అందుతోంది. కాగా, జూన్ నెలాఖరులో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని ప్రకటించారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.






