రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

by Muthe.Rajitha |   (  Updated:2025-03-05 18:05:44  IST  )

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ కేబినెట్​ భేటిలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్​ నివేదికకు ఆమోదం తెలుపనుంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఆమోదిస్తారు. బీసీ గణనకు మరోసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో నమోదు చేసుకున్న వివరాలతో తుది గణననకు ఆమోదం తెలపనుంది. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్​లు పెంచే బిల్లుకు, రాజకీయంగా రిజర్వేషన్​లు కల్పించే బిల్లులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. వీటితో పాటుగా బడ్జెట్​ సమావేశాల తేదీలను అధికారికంగా ఖరారు చేస్తారు.

ఏ రోజున ప్రారంభమయ్యేది, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను తదితర వాటిని ఖరారు చేస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే గవర్నర్​ ప్రసంగానికి కేబినెట్​ ఆమోదముద్ర వేయనుంది. దీనితో పాటుగా టూరిజం పాలసీకి ఆమోదం తెలపనుంది. వివిధ శాఖలకు సంబంధించిన కొత్త పోస్టులు క్రియెట్​ చేయడం, వాటికి ఆమోదించనుంది. మరికొన్ని అంశాలకు ఆమోదముద్ర వేయనుంది.

Next Story