ఈ నెల 16న తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల పిటిషన్.. భేటీపై ప్రాధాన్యత

by Ramesh Naini |

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 16వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 3.00 గంటలకు జరగనుంది.

ఈ నెల 16న తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల పిటిషన్.. భేటీపై ప్రాధాన్యత
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ మంత్రి వర్గ సమావేశం (Telangana Cabinet meeting) ఈ నెల 16వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 3.00 గంటలకు జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశం తెలంగాణ సచివాలయం 6వ అంతస్తులోని కేబినెట్ సమావేశం హాల్లో నిర్వహించనున్నారు. మంత్రులు అందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రధాన కార్యదర్శి ఆదేశాల్లో పేర్కొన్నారు.

కాగా, సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, పలు అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో 40 పేజీల పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణ గురువారం ఉండే అవకాశం ఉంది. దీంతో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court petition) విచారణ ముందు కేబినెట్‌ వ్యూహంపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని భేటీపై ప్రాధాన్యత ఏర్పడింది.

Next Story