- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 29వ తేదీన తెలంగాణ కేటినెట్ భేటీ కానుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 29వ తేదీన తెలంగాణ కేటినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ నూతన సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. గవర్నర్ కోటాలో రాష్ట్ర కేబినెట్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంతో ఈ అంశంపై ఈ భేటీలో మంత్రిమండలి చర్చించనుంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై కేబినెట్ చర్చ జరపనుంది. ఈ రెండు అంశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. ఎన్నికల సమీపిస్తోన్న వేళ కేసీఆర్ కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story






