- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Cabinet: ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసారి హైదరాబాద్‍కు దూరంగా సమావేశం!
తెలంగాణ కేబినెట్ భేటీపై కీలక అప్ డేట్ వచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సచివాలయంలో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఈ సారి మేడారంలో నిర్వహిచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ఈ జాతరకు ముందు మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే జనవరి 18న ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించి మధ్యాహ్నం మేడారంలో కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. ఆ రాత్రి మేడారంలోనే సీఎం రేవంత్ బస చేయనున్నట్లు సమాచారం. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాల ప్రారంభించి తొలి దర్శనం చేసుకుంటారు. అనంతరం హైదరాబాద్‍కు చేరుకుని సాయంత్రం దావోస్ కు ప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది. మేడారం జాతర ఏర్పాట్లు, రాబోయే బడ్జెట్ సమావేశాలు, ఆర్థిక పరిస్థితిులు, రాష్ట్రంలో నీటి వాటాల అంశంతో పాటు తాజా పరిణామాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.






