- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం కేబినెట్ భేటీ కానుంది. సాగునీరు, రైతులు మరియు ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎల్లుండి తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet Meeting) భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోబోతోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, రైతుల అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే మరికాసేపట్లో ప్రభుత్వ అధికారుల సంఘం నేతలతో సీఎం భేటీ కాబోతున్నారు. దీంతో ఎల్లుండి జరగబోయే కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ తీపి కబురు ఉండబోతోందా అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Next Story






