ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం.. తీసుకున్న కీలక నిర్ణయం ఇదే!

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-23 16:22:02  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది.

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం.. తీసుకున్న కీలక నిర్ణయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. పలు అంశాలపై ఐదు గంటలకు పైగా చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ పాలసీ(Sports Policy)కి ఆమోదించారు. కాగా, అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు. ఇప్పటికే కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై సమీక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను ప్రధానంగా చర్చించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.

Next Story