తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం.. మంత్రి కొండా సురేఖ డుమ్మా

by Kema Shiva Kumar |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో సరిగ్గా 4.30 కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.

తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం.. మంత్రి కొండా సురేఖ డుమ్మా
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో సరిగ్గా 4.30 కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ రామకృష్ణా రావు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నిక నిర్వణపై సమాలోచనలు చేయనున్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టు (Supreme Court)లో దాఖలు చేసిన స్పెషల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై డిస్కస్ చేయనున్నారు. వానాకాలం ధాన్యం సేకరణ, మెట్రో రైలు ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు పనుల ప్రారంభం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్‌‌‌‌ అండ్‌‌‌‌ టీ తప్పుకున్న నేపథ్యంలో ఆ విషయంపై మంత్రి వర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ పనులు తిరిగి ప్రారంభించడంపై చర్చించి.. పనులు మొదలు పెట్టేందుకు ఆమోదం తెలుపనున్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం, సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టు ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజీ లాంటి విషయాలు చర్చకు రానున్నాయి. మూసీ ప్రాజెక్టు, గిగ్‌‌‌‌ వర్కర్ల సంక్షేమ చట్టం, టీ-ఫైబర్‌‌‌‌ విస్తరణ, ఫ్యూచర్‌‌‌‌ సిటీ అంశాలు కేబినెట్‌‌‌‌ భేటీలో డిస్కస్ చేసే చాన్స్ ఉంది.

కాగా, సుమంత్ అరెస్ట్ ఎపిసోడ్‌లో కొండా సుస్మిత (Konda Sushmita) ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కాసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ, కూతురు సుస్మితతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్కను కలిశారు. అయితే, నేటి కేబినెట్ భేటీకి కొండా సురేఖ గైర్హాజరు అవ్వడం కొసమెరుపు

Next Story