తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా మంత్రి మండలి సమావేశం ప్రారంభం అయింది.

తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా మంత్రి మండలి సమావేశం(Telangana Cabinet) ప్రారంభం అయింది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో.. కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మార్చి 2 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై వంద రోజుల ప్రణాళికను మంత్రివర్గం చర్చించి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖలు వంద రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

Next Story