తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి(Telangana Cabinet) సమావేశం ప్రారంభమైంది.

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి(Telangana Cabinet) సమావేశం ప్రారంభమైంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై ఈ సమావేశంలో కీలక చర్చించనున్నారు. కాగా, కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్లు తెలపడమే కాక ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో కూడా కమిషన్‌ పేర్కొంది. న్యాయ విచారణ కమిషన్‌లు నివేదికలు ఇచ్చినపుడు గతంలో ఏ రాష్ట్రంలో ఎలా చేశారు? తదుపరి కార్యచరణ ఏమిటన్న దానిపై కేబినెట్‌లో చర్చిస్తారని తెలుస్తోంది. నివేదికను పరిశీలించి ముఖ్యమైన సిఫార్సులను మంత్రివర్గం ముందు ఉంచడానికి సీఎం రేవంత్‌రెడ్డి ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Next Story