- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Cabinet: మాదిగలకు 9 శాతం మాలలకు 5 శాతం!.. కేబినెట్ లో కీలక చర్చ
ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశం అయింది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే (Caste Census) నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదికపై కేబినెట్ చర్చిస్తోంది. ఎస్సీ వర్గీకరణ (SC Classification)పై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ నిన్న ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. ఈ నివేదిక ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల కోటాను కేబినెట్ ఆమోదం తెలపబోతున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ కోటాలో మొత్తం 15 శాతం రిజర్వేషన్ అమలు చేయనుండగా అందులో 1 శాతం సంచార జాతులు, 9 శాతం మాదిగ ఉప కులాలు, 5 శాతం మాల ఉపకులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసేలా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన రిజర్వేషన్ల విధానంపై కూడా మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలను ఆమోదించి అనంతరం అసెంబ్లీ ముందుకు నివేదికను పంపనుంది.






