- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణనపై తెలంగాణ కేబినెట్‌లో చర్చ
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన(census) 2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన(census) 2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం(Telangana Cabinet) చర్చించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన(హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు వివరించారు. హౌజ్ లిస్టింగ్‌కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జన గణన ప్రక్రియలో పాలుపంచుకుంటారు. రెండో దశ జన గణన ప్రక్రియ వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో చేపడుతారు. మరోవైపు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైతు భరోసాతో పాటుగా మహాలక్ష్మీ పథకం పైన కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఈ రోజు వీటి పైన అధికారికంగా ఆమోదం వేసే అవకాశం కనిపిస్తోంది.






