- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: సర్పంచ్ ఆశావహులకు గుడ్ న్యూస్.. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
తెలంగాణ సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కాగా, ఇప్పటికే పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని సవరించే దస్త్రంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ఇదే అంశంపై ఏపీలో జరిపిన చట్ట సవరణను తెలంగాణ పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలోనూ చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసి సమర్పించగా... మంత్రి ఆమోదించారు. దీనిని ఇవాళ మంత్రివర్గ సమావేశంలో సమర్పించారు. చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీపై మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.






