Telangana Budget 2023: వ్యవసాయ రంగానికి పెద్ద పీట

by Sathputhe Rajesh |   (  Updated:2023-02-06 06:12:56  IST  )

తెలంగాణ సర్కారు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది

Telangana Budget 2023: వ్యవసాయ రంగానికి పెద్ద పీట
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కారు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.26,831 కోట్లు కేటాయించింది. రైతు వేదికలకు రూ.26,835 కోట్లు కేటాయించింది. రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు కేటాయించింది. వడ్డీలేని రుణాల కోసం రూ.1500కోట్లు కేటాయించింది. ఆయిల్ పామ్ సాగు కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో తెలిపారు. తమ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా అందిస్తోందన్నారు. ఈ రైతుబంధు పథకాన్ని కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట అమలు చేస్తోందన్నారు.

Also Read..

Telangana Budget 2023: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Next Story