- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియా గేట్ వద్ద ఘనంగా బోనాల వేడుకలు
by Prasad Jukanti |
ఇండియా గేట్ వద్ద ఘనంగా బోనాల సందడి మొదలైంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో తెంలగాణ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం ఇండియా గేట్ వద్ద ఘటం ఊరేగింపు వేడుక ఘనంగా జరిగాయి. ఈ బోనాల వేడుకలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీలో నివాసం ఉంటున్న తెలంగాణ ఆడపడుచులు ఇండియా గేట్ వద్దకు బోనాలు తీసుకువచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, పోతరాజు నృత్యాల నడుమ ఈ వేడుకలో కోలాహలంగా జరిగాయి. కాగా ఆషాడ మాసం ప్రారంభం కావడంతో గత ఆదివారం చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
Next Story






