- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
13 మందిని సస్పెండ్ చేసిన తెలంగాణ బీజేపీ
మున్సిపల్ ఎన్నికలలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిపై బీజేపీ వేటు వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిపై బీజేపీ వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నందున రాష్ట్ర క్రమశిక్షణ సంఘం వారిని సస్పెండ్ చేయాలన్న నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు దృష్టికి తీసుకెళ్లగా వారి సూచన మేరకు సోమవారం రాష్ట్ర క్రమశిక్షణ సంఘం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీలో సాంబారి కళావతి, అరవ లక్ష్మి, ముద్దం రాము, రావతి రాజు, కొక్కుల ధర్మేంద్ర, సిరికొండ భారతి, పులి శ్రీధర్, మెట్ పల్లి లో మరి సంద కిశోర్, ఆర్మూర్ప్రశాంత్, బొండ్ల నరేష్, కోరుట్ల నుంచి ఇందూరి సత్యం, అయిలాపూర్పద్మ, తోట రాజేశం సస్పెండ్చేశారు. ఈసస్పెన్సన్తక్షణమే అమలుల్లోకి వస్తోందని, నేటి నుంచి వారం రోజులోపు వారంతా తమ ప్రవర్తనపై రాష్ర్ట పార్టీకి వివరణ ఇవ్వాలని రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ కన్వీనర్రవీందర్విశ్వనాథ్ కోరారు.






