DK Aruna: సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ మద్దతు.. ఏపీ డీకే అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ మద్దతు

DK Aruna:  సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ మద్దతు..   ఏపీ డీకే అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో:నీటి సమస్యలపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం మంచిదేనని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. సెంటిమెంట్ తో లబ్ధిపొందాలనుకోవడం సరికాదన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆమె.. తెలంగాణకు నష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ మద్దతుగా నిలుస్తుందన్నారు. తెలంగాణకు నష్టం జరిగే పని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ చేయదని స్పష్టం చేశారు.

బనకచర్లపై రాజకీయం:

ఇక నిన్న జరిగిన సీఎంల సమావేశంలో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వివాదం సాగుతోంది. నిన్నటి సమావేశంలో బనకచర్లపై సమావేశం జరగలేదని కాంగ్రెస్ చెబుతుంటే మొదటి ఎజెండాలోని అంశమే బనకచర్ల అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. అందరూ వద్దంటున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంత ప్రేమెందుకో ప్రజలకు అర్థం కావట్లేదని ధ్వజమెత్తారు. ఇటు రాష్ట్ర మేధావులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని ఆ ప్రతిపాదన పనికిరాదని సీమ ప్రొఫెసర్లు చెబుతున్నారు. లక్ష కోట్లకుపైగా ఖర్చు తప్ప ప్రయోజనం లేదని ఇంజినీర్లు మొత్తుకుంటున్నారు. ఒక్క కాంట్రాక్టర్ కు తప్ప ఆంధ్రప్రదేశ్ కు ఏ మాత్రం ఉపయోగపడని గుదిబండ ప్రాజెక్టు కోసం రాష్ట్రాన్ని, పాలనను గాలికొదిలేసి చంద్రబాబు ఢిల్లీ చుట్టూ అంత ఆత్రంగా ఎందుకు తిరుగుతున్నారని షర్మిల ప్రశ్నించారు.

Next Story