- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ సుమిరన్ కొమర్రాజు అరెస్ట్
తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సుమిరన్ కొమర్రాజు అరెస్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టగా కేసు నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సుమిరన్ కొమర్రాజు అరెస్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టగా కేసు నమోదైంది. దీంతో నేడు మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఆరా తీశారు. సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సుమిరన్ కొమర్రాజుతో పాటు సోషల్ మీడియా హ్యాండిల్ చేసే అజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు గురించి చెబుతూ రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను ఉదాహరణగా తీసుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను అవమానించేలా ఉన్నాయని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో బీజేపీ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేసింది. మరోవైపు బీజేపీ నేతలు సైతం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు కురిపించారు. రేవంత్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.






