సీఎం రేవంత్ ఇంటిఎదుట నిరసనలకు పిలుపు.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

by Naga Rani Yarlagadda |

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

సీఎం రేవంత్ ఇంటిఎదుట నిరసనలకు పిలుపు.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పార్లమెంట్లో బిల్లులు వీగిపోయిన క్రమంలో నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం రేవంత్ ఇంటి ఎదుట నిరసన, ఆందోళనలు చేపట్టాలని రాష్ట్ర బీజేపీ విభాగం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తార్నాకలో రాం చందర్ రావు సహా.. బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు కాంగ్రెస్ కు కీలక హెచ్చరిక చేశారు. నారీశక్తికి ద్రోహం చేసిన ఆ పార్టీని వదిలిపెట్టబోమన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్ తీరును గల్లీగల్లీలో ఎండగడతామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను అణచివేస్తోంది. ఇది నియంతృత్వ ధోరణి అని ఆరోపించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. నారీశక్తికి ద్రోహం చేసిన ఆ పార్టీని మహిళా లోకం క్షమించదు అని రాంచందర్ రావు మండిపడ్డారు.

Next Story