BJP: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు! టీ బీజేపీ పార్టీ సెటైరికల్ ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-02-08 13:10:37  IST  )

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం అందుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు.

BJP: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు! టీ బీజేపీ పార్టీ సెటైరికల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (DelhiElectionsResults2025) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం అందుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి చోటు చేసుకుంది. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు ఇచ్చారని తెలంగాణ బీజేపీ పార్టీ (Telangana BJP) నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ పార్టీ అఫీషియల్ ఎక్స్ ఖాతా వేదికగా సెటైరికల్ ట్వీట్ చేసింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు 2025 సందర్భంగా బాలక్‌బుద్ధి, గుంపుమేస్త్రి కోసం ప్రత్యేక పాట.. అంటూ వీడియో షేర్ చేసింది.

గత తెలంగాణ ఎన్నికల సమయంలో రాష్ట్రానికి కేంద్రం బీజేపీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డును సింబల్‌ను నెత్తిన పెట్టుకోని ప్రచారంలో పాల్గొన్నారు. అదే సింబల్‌ను బీజేపీ ఉపయోగించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై విమర్శలు చేస్తూ ట్వీట్ వేసింది. చేయి సింబల్ సైతం గుండు సున్నా చూపిస్తున్న విధంగా వీడియోలో కన్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ట్వీట్ తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతుంది.

కాగా, ఢిల్లీ 2025 ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు దూసుకెళ్తుంటే.. ఆప్ మాత్రం డీలా పడింది. ఆమ్ ఆద్మీ అధినేత పార్టీ అధినేత కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వంటి కీలక నేతలు ఓడిపోయారు. ఇక, బీజేపీ 48 స్థానాల్లో ముందంజలో ఉండగా.. తర్వాత ఆప్ 22 చోట్ల లీడ్‌ ఉంది.

Next Story