- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP MP: తుమ్మితే ఊడిపోయే ముక్కులా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్(MP Laxman) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్(MP Laxman) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ తుమ్మితే ఊడిపోయే ముక్కులాగే ప్రభుత్వాలు కొనసాగున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. త్వరలోనే దేశం నుంచి కాంగ్రెస్‌ను ప్రజలే పాలదోలుతారని అన్నారు. తెలంగాణలో ఆనాడు రజాకార్లను తరిమికొట్టినట్లు కాంగ్రెస్‌ను తరిమేయడం పక్కా అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పుడూ అధికారంలోకి రాదని.. రేవంత్ రెడ్డే చివరి ముఖ్యమంత్రి అని అన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిలో అసహనం, అభద్రత కనిపిస్తోందని తెలిపారు. రాహుల్ గాంధీ మెప్పుకోసం మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ నేతలు కాదని.. కాంగ్రెస్ నేతలే బ్రిటీష్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని తెలిపారు.
కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmedabad) వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ(AICC Plenary) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కులాలు, మతాల మధ్య ప్రధాని మోడీ(Prime Minister Modi) చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. దేశాన్ని విభజించాలని మోడీ చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ(BJP)ని అడుగుపెట్టనివ్వమని కీలక ప్రకటన చేశారు. గతంలో బ్రిటీష్ వాళ్లను దేశం నుంచి తరిమి కొట్టినట్లే బీజేపీనీ తరిమి కొట్టాలని.. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు లక్ష్మణ్ స్పందించి కౌంటర్ ఇచ్చారు.






