తెలంగాణ బీజేపీ నేతల కీలక నిర్ణయం

by Ajay Maddhiboyina |

తెలంగాణ బీజేపీ నేత‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. నేటి నుండి కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని నేత‌లు నిర్ణ‌యించారు. దీంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో నేత‌లు

తెలంగాణ బీజేపీ నేతల కీలక నిర్ణయం
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ నేత‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. నేటి నుండి కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని నేత‌లు నిర్ణ‌యించారు. దీంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో నేత‌లు కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉంటారు. ఒక్కో రోజు ఒక్కో ప్ర‌జాప్ర‌తినిధి పార్టీ కార్యక‌ర్త‌ల కోసం కార్యాల‌యంలో ఉంటారు. దీని కోసం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి ఆఫీసులో ఓ ప్ర‌త్యేక గ‌దిని సైతం ఏర్పాటు చేశారు. ఈ రోజు కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఉన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణ బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. కార్యర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంతో పాటూ జనాల్లోకి వెళ్లేందుకు ప్రతిరోజు అందుబాటులో ఉండటం అవసరం అని కాషాయ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు త్వరలో రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ ప్రభావం చూపేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.

Next Story