ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఆ దమ్ము లేదంటున్న కేటీఆర్

by Disha Web Desk 12 |
ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఆ దమ్ము లేదంటున్న కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క బీజేపీ నాయకుడికి తెలంగాణ తరఫున న్యాయంగా డిమాండ్ చేసే దమ్ము లేదని ప్రోఫెసర్ నాగేశ్వర్ రావు ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ విధంగా ట్వీట్ చేశారు. కేటీఆర్ తన ట్వీట్ లో "తమ గుజరాతీ బాస్‌ల చెప్పులను మోయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ తెలంగాణ హక్కులను డిమాండ్ చేసే ధైర్యం చేయలేరు" గుజరాత్ మోడీవర్స్‌కు కేంద్రం అని రాసుకొచ్చాడు.

అయితే అంతకు ముందు ప్రోఫెసర్ నాగేశ్వర్ రావు తన ట్విట్‌లో RRR సినిమా ఆస్కార్ బరి నుంచి తప్పుకొవడానికి కారణం గుజరాతి సినిమా అని.. అలాగే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిరాకరించింది. కానీ గుజరాత్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ వచ్చింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని డబ్ల్యూహెచ్‌ఓ కేంద్రాన్ని మన హైదరాబాద్ కోల్పోయింది. అని రాసుకొచ్చారు.

Also Read: టీఆర్ఎస్‌పై ఎక్కడికక్కడ జనాగ్రహం.. సొంత నియోజకవర్గాల్లో మంత్రులకు చుక్కలు!


Next Story

Most Viewed