19 ఎస్సీ సెగ్మెంట్లూ గెలవాల్సిందే.. రూట్ మ్యాప్ సిద్ధం చేసిన బీజేపీ

by Dishafeatures2 |
19 ఎస్సీ సెగ్మెంట్లూ గెలవాల్సిందే.. రూట్ మ్యాప్ సిద్ధం చేసిన బీజేపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు పంజా విసరాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను సైతం కమలం పార్టీ సిద్ధం చేసుకుంది. కాగా నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సహ ఇన్ చార్జీ అర్వింద్ మీనన్ రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇన్ చార్జీలతో సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు రెండు గంటల సుదీర్ఘ చర్చ జరిపి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. 19 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా రూట్ మ్యాప్ సిద్ధమైందని, అందుకు అనుగుణంగా ఎస్సీ మోర్చా నేతలు పనిచేయాలన్నారు.

మండలాలకు ఇన్ చార్జీలను నియమించి ప్రత్యేకంగా సెగ్మెంట్లలోని ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి దళిత బస్తీకి వెళ్లి వివరించాలని ఆదేశించారు. ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో మేధావులను, విద్యావంతులను కలిసి వారికి తమ ఆలోచనలు, ఆశయాలను తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎస్సీ మోర్చా ఇన్ చార్జీ గంగిడి మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు వేముల అశోక్ ఉన్నారు.

Next Story

Most Viewed