BJP Corporators : బిక్షాటనకు దిగిన తెలంగాణ బీజేపీ కార్పోరేటర్లు!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-30 06:31:41  IST  )

హైద‌రాబాద్‌లో బీజేపీ కార్పొరేట‌ర్లు(BJP Corporators)వినూత్న నిర‌స‌న‌కు దిగారు. బిక్షాట‌న చేస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్(GHMC Council)కౌన్సిల్ స‌మావేశానికి కార్పొరేట‌ర్లు వచ్చారు. వారిలో చాల మందిని అక్కడున్న వారు గుర్తు పట్టలేనంతగా బిచ్చగాళ్ల వేషధారణలో కార్పోరేటర్లు బిక్షాట(Begging)న చేస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చారు.

BJP Corporators : బిక్షాటనకు దిగిన తెలంగాణ బీజేపీ కార్పోరేటర్లు!
X

దిశ, వెబ్ డెస్క్ : హైద‌రాబాద్‌లో బీజేపీ కార్పొరేట‌ర్లు(BJP Corporators)వినూత్న నిర‌స‌న‌కు దిగారు. బిక్షాట‌న చేస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్(GHMC Council)కౌన్సిల్ స‌మావేశానికి కార్పొరేట‌ర్లు వచ్చారు. వారిలో చాల మందిని అక్కడున్న వారు గుర్తు పట్టలేనంతగా బిచ్చగాళ్ల వేషధారణలో కార్పోరేటర్లు బిక్షాట(Begging)న చేస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. రాజకీయ వివక్షతతో తమ వార్డులకు జీహెచ్ఎంసీ పాలక వర్గం నిధులు కేటాయించ‌డం లేద‌ంటూ బీజేపీ కార్పోరేటర్లు బిక్షాటనతో వినూత్న నిరసన చేపట్టారు.

గోషామహాల్ స్టేడియం కూల్చోద్ధని..అక్కడ కాకుండా ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి ఉన్న చోట దాని వెనుక స్థలంతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా బిచ్చగాళ్ల వేషధారణలతో కౌన్సిల్ సమావేశానికి వచ్చిన బీజేపీ కార్పొరేట‌ర్లను పోలీసులు అడ్డుకోవడం వాగ్వివాదానికి దారి తీసింది. మరోవైపు బీఆర్ఎస్ కార్పోరేటర్లు సైతం ఫ్లకార్డ్సుతో మేయర్ విజయలక్ష్మిని రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ సమావేశం ప్రారంభమైన కాసేపటికే గొడవకు దిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదంటూ ఫ్లకార్డులతో నినాదాలు చేస్తూ బడ్జెట్ సమావేశాకకు అడ్డుపడుతూ మేయర్ పోడియం వద్దకు వెళ్లేందుకు యత్నించారు.

వారి ఫ్లకార్డ్సును కాంగ్రెస్‌ సభ్యులు లాక్కుని చించి వేయగా, బడ్డెట్ ప్రతులు బీఆర్ఎస్ కార్పోరేటర్లు చించివేశారు. దీంతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట నెలకొంది. మార్షల్స్ బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపించగా..పోలీసులు వారిని అరెస్టు చేసి పలు స్టేషన్లకు తరలించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్యనే రూ.8,440కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదించింది

. కాంగ్రెస్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి మెజార్టీ లేనప్పటికి ప్రతిపక్షాలను కౌన్సిల్ నుంచి గెంటివేసి బడ్జెట్ ను ఆమోదింపచేసుకున్నారని..కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు ఇది నిదర్శనమని బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. నైతిక విలువలు ఉంటే మేయర్ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పోరేటర్లు డిమాండ్ చేశారు.

Next Story