- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి పౌరుడిలో హర్ ఘర్ తిరంగా యాత్ర దేశభక్తి నింపుతోంది
దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా యాత్ర భారత్‌లోని ప్రతి పౌరుడి గుండెలో దేశభక్తి నింపుతోందని రాంచందర్‌రావు

ప్రతి పౌరుడిలో హర్ ఘర్ తిరంగా యాత్ర దేశభక్తి నింపుతోంది
మరోసారి దేశ విభజన జరగకూడదనే లక్ష్యంతో యాత్ర ప్రారంభం
దేశాభివృద్ది జరగాలంటే దేశభక్తి, జాతీయవాదం అవసరం : బీజేపీ చీప్ రాంచందర్‌రావు
దిశ, తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా యాత్ర భారత్‌లోని ప్రతి పౌరుడి గుండెలో దేశభక్తి నింపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు పేర్కొన్నారు. గురువారం నెక్లెస్ రోడ్ పై తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరేయడం ద్వారా దేశ ఐక్యత, గౌరవం, సమగ్రత, దేశభక్తిని నింపేలా గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. నెక్లెస్ రోడ్డులో చేపట్టిన తిరంగా ర్యాలీలో యువత, విద్యార్థులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యమయ్యారు. భారతదేశంలో మోడీ నేతృత్వంలో సుపరిపాలనతో ముందుకు సాగుతోంది. భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఆర్థిక శక్తిగా ఎదిగిందని రాబోయే రోజుల్లో సూపర్ పవర్‌గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశం అభివృద్ధి చెందాలంటే దేశభక్తి, జాతీయవాదం అవసరమని, ఆ నేషనలిజం స్ఫూర్తిగా దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణలో 40 లక్షల ఇండ్లపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటడం జరుగుతోందని రాబోయే తరాలకు ఈ స్ఫూర్తిని అందించాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతోంది. తిరంగా యాత్ర జరుగుతోందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి వేలాది మంది పోరాటయోధులు, మహనీయుల త్యాగాలే కారణమని వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అన్నారు. మన దేశాన్ని విడగొట్టి మన దేశ సంపద దోచుకున్న పాకిస్థాన్ కు, ఆ రోజున మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టిన బ్రిటిషర్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుందన్నారు. మరోసారి దేశ విభజనకు ప్రసక్తే ఉండకూడదనే సంకల్పంతో భారతదేశ ఐక్యతను, సమగ్రతను, సంస్కృతిని కాపాడేలా తిరంగా యాత్ర ద్వారా సంకల్పం తీసుకొస్తున్నట్లు తెలిపారు.






