‘టెర్రరిజం, కమ్యూనిజం ఒక్కటే’.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.

‘టెర్రరిజం, కమ్యూనిజం ఒక్కటే’.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ దానికి కిషన్ రెడ్డే కారణమని రేవంత్ రెడ్డి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది. పాలన చేతగాక చేతులు ఎత్తేసి కిషన్ రెడ్డి(Kishan Reddy)పై నిందలు వేస్తున్నారు. బ్యూరోక్రాట్ల నియామకంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి ఫెయిల్ అయింది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు. బీజేపీ డిమాండ్‌తో కాళేశ్వరం విచారణను సీబీఐకి ఇచ్చారు. ఇక విచారణ ఎప్పుడు మొదలు పెట్టాలనేది సీబీఐ ఇష్టం. సీబీఐ విచారణ అంశంలో బీజేపీ, మోడీకి సంబంధం ఉండదు అని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టొద్దని కాంగ్రెస్ భావిస్తోందని రాంచందర్ రావు విమర్శించారు. అందుకే కావాలని ఆలస్యం చేస్తున్నారని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు రావని చెప్పారు. మావోయిస్టుల హింస పెరగడం వల్లే ఆపరేషన్ కగార్‌(Operation Kagar)ను ఉధృతం చేశారని అన్నారు. టెర్రరిజం, లెఫ్ట్ టెర్రరిజం ఒక్కటే అని రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

Next Story