- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు 61% పైగా గెలిచారు: తెలంగాణ బీసీ కమిషన్
తెలంగాణలో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీసీలు మొత్తంగా 61%కు పైగా గెలవటం పట్ల బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీసీలు మొత్తంగా 61%కు పైగా గెలవటం పట్ల బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో, మున్సిపల్ వార్డులలో బీసీలకు 28.22%, మున్సిపల్ కార్పోరేషన్‌లలో మొత్తం వార్డులలో 35.25% బీసీలకు కేటాయించినా జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలిచి, మొత్తం మీద 61% గెలవటం బీసీ వర్గాల ప్రజలలో పెరిగిన చైతన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ మేరకు బీసీ కమిషన్ బుధశారం ఓ ప్రకటన విడుల చేసింది.
పంచాయితి, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలు గెలిచిన స్థానాలను దష్టిలో పెట్టుకొని కేంద్రం 42% రిజర్వేషన్లకు అమలు చేయడానికి అనుమతినివ్వాలని, 9వ షెడ్డ్యూల్‌లో చేర్చాలని విజ్జప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా అది ఇంకా కేంద్ర ప్రభుత్వంలో పెడ్డింగ్‌లో ఉండటం, కొందరు కోర్టు కెళ్లి ఈ రిజర్వేషన్ అమలు కాకుండా చేయడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు.
కోర్టుల్లో కేసులు వేసిన వారు కూడా వారి కేసులను ఉపసంహరించి చట్టబద్ధంగా బీసీల రిజర్వేషన్లు సాకారమయ్యే మార్గం సుగమం చేయాలని బీసీ కమిషన్ కోరుకుంటందని తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో కూడా బీసీ అభ్యర్థులు 52.75% గెలిచారని, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ, కార్పోరేషన్ల ఎన్నికల్లో కూడా బీసీలు అత్యధికంగా గెలుస్తారనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన సమగ్ర సర్వేలో బీసీల సంఖ్య 56.33% అని తేలిందన్నారు.






