- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ వెబ్ డెస్క్: పోలీసులకు చిక్కిన రెండు కోళ్లని.. పోలీస్ స్టేషన్ లో వేలం వేశారు. గత నెల 27 వ తేదీన కోడి పందాలు ఆడుతున్న సమయంలో రెండు కోళ్ళతో పాటూ పందాలు ఆడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు పెద్దపల్లి పోలీసులు. కోర్టు ఆదేశాల ప్రకారం రెండు కోళ్లకి వేలం వేశారు. అయితే ఈ వేలంలో 20 మంది పాల్గొన్నారు. వేలం నిర్వహించడంతో పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం హడావిడి నెలకొంది. కోళ్ళ యొక్క వేలాన్ని చూడటానికి అక్కడి చుట్టు పక్కల ప్రజలు తరలివచ్చారు. అయితే సహజంగానే పోలీస్ స్టేషన్ లో ఎటువంటి వేలాలు ఉండవు. కానీ కోళ్ళ వేలం ఎలా ఉంటుందో చూడడానికి మాత్రం జనాలు ఆసక్తిగా వీక్షించారు. మొత్తానికి ఈ వేలంలో 20 మంది పాల్గొంటే.. అందులో పురాణం సారయ్య అనే వ్యక్తి మొదటి కోడిని రూ.4000 లకు, రెండవ కోడిని రూ. 2500 లకు బోనాల సత్యనారాయణ వేలం లో దక్కించుకున్నారు.






