- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana: రాజ్‌భవన్ లో "ఎట్ హోం కార్యక్రమం".. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ(telangana) రాజ్ భవన్(Raj Bhavan) లో జరుగుతున్న ఎట్ హోం కార్యక్రమానికి(AT Home Program) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహా మంత్రులు హాజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(telangana) రాజ్ భవన్(Raj Bhavan) లో జరుగుతున్న ఎట్ హోం కార్యక్రమానికి(AT Home Program) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహా మంత్రులు హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆహ్వనం మేరకు ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, కేంద్ర బొగ్గు, గనుల మంత్రి, జి కిషన్ రెడ్డి, కన్హా శాంతివనం వ్యవస్థాపకులు కమలేష్ డి పటేల్, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024’ అవార్డులను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకు అందించారు.
పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగ జన సంక్షేమం, క్రీడలు, ఆటలు, సంస్కృతి అనే నాలుగు ముఖ్యమైన రంగాల్లో వ్యక్తులు, సంస్థలు చేసిన అత్యుత్తమ కృషి, స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా అవార్డులను ఇస్తారు. ప్రతి అవార్డుకు రూ.2 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారు. పర్యావరణ పరిరక్షణ విభాగంలో దుశ్చర్ల సత్యనారాయణ, దివ్యాంగుల సంక్షేమంలో అరికపూడి రఘు, స్పోర్ట్స్ విభాగంలో పారా ఒలింపిక్ విజేత, జీవాంజీ దీప్తి, సాంస్కృతిక విభాగాల్లో పీబీ కృష్ణ భారతి, ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు కు సంయుక్తంగా అవార్డును అందుకున్నారు. అలాగే సంస్థల విభాగంలో.. పర్యావరణ పరిరక్షణ విభాగంలో ధ్రువాంశు ఆర్గనైజేషన్ తరపున మధులిక చౌదరి, దివ్యాంగ జన సంక్షేమంలో ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్గనైజేషన్ ఆదిత్య మెహతా ఫౌండేషన్ తో పాటు సంస్కృతి ఫౌండేషన్ పక్షాన టి. రాంబాబు కు గవర్నర్ పురస్కారాలను ప్రదానం చేశారు. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను డా. జి. చంద్రశేఖర్ రెడ్డి కి అందించారు. అనంతరం అవార్డు జ్యూరీ సభ్యులను గవర్నర్, సీఎం ప్రత్యేకంగా సన్మానించారు. తర్వాత గవర్నర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. కాగా ప్రతీ ఏడాది స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలకు రాష్ట్రంలోని ప్రముఖులను గవర్నర్ రాజ్‌భవన్‌కు ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.






