రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ భారీ వ్యూహం ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-12-08 11:14:00  IST  )

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) ప్రారంభం కానున్నాయి. ...

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ భారీ వ్యూహం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీని దీటుగా ఢీకొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ(Brs) సిద్ధమవుతోంది. కాంగ్రెస్(Congress) పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Former Cm Kcr) ఆధ్యర్యంలో బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ మేరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్(BRS LP meeting) నిర్వహించారు.


ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గత సమావేశంలో అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, ఈ సెషన్స్‌లోనూ అదే స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తాలని సూచించారు. అయితే గత సమావేశాలకు కేసీఆర్ హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు పలుమార్లు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈసారి సమావేశాలకు అయినా కేసీఆర్ వెళ్తారా లేదా అనేది ఎల్పీ మీటింగ్ ముగిసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పలువురు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

Next Story