- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Assembly: విపక్ష సభ్యుల ఆందోళన.. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల ఆందోళనతో శాసన సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ రేపటికి వాయిదా వేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly sessions) వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల ఆందోళనతో శాసన సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) రేపటికి వాయిదా వేశారు. లగచర్ల అంశంపై శాసనసభలో చర్చకు బీఆర్‌ఎస్ పట్టుబట్టింది. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతుల బేడీల విషయంలో చర్చ చేపట్టాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించాలని ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. దీంతో సభ్యుల ప్లకార్డులు తీసుకురావాలని మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశాలిచ్చారు. ప్లకార్డులు మార్షల్స్‌కు ఇస్తే మాట్లాడే అవకాశమిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. అయిన కూడా విపక్ష సభ్యుల నినాదాల మధ్య సభ రేపటికి స్పీకర్ వాయిదా వేశారు. మంగళవారం 10:00 గంటలకు సభ స్టార్ట్ అవుతుందని స్పీకర్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నిరసన
సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత లగచర్ల రైతులకు బేడీల విషయంలో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ ఆవరణలో బిఆర్ఎస్ శాసన సభ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేసిన ఫోటోలతో కూడిన ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఇది దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం






