Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా

by Gantepaka Srikanth |

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. శనివారం బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చ ముగిసింది.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. శనివారం బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చ ముగిసింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారానికి సభను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ఒక్కరోజు విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం తిరిగి ప్రారంభమయ్యాయి. కాగా, ఇవాళ్టి సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య రసవత్తరంగా చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య ఏకంగా మాటల యుద్ధమే జరిగింది. ఒకానొక దశలో వ్యక్తిగత దూషణలు సైతం చేసుకున్నారు.

Next Story