- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మరికొన్ని నిమిషాల్లో అంతా గప్ చుప్..!
by Satheesh |
దాదాపు రెండు నెలలుగా ఎన్నికల ప్రచార పాటలతో నిద్రలేచిన తెలంగాణ.. మరో గంటలో ప్రచారాలన్నీ గప్ చుప్ అవ్వనున్నాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ నేటి సాయంత్రం ఐదు

X
దిశ, డైనమిక్ బ్యూరో: దాదాపు రెండు నెలలుగా ఎన్నికల ప్రచార పాటలతో నిద్రలేచిన తెలంగాణ.. మరో గంటలో ప్రచారాలన్నీ గప్ చుప్ అవ్వనున్నాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ నేటి సాయంత్రం ఐదు గంటలకు తెరపడనుంది. బహిరంగసభలు, రోడ్ షోలు, ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగులు, వివిధ సెక్షన్ల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు.. ఇలాంటి అనేక ప్రోగ్రామ్‌లతో రాష్ట్రంలో నెలకొన్న కోలాహలం మరో గంటలో సద్దుమణగనున్నది. ఇక మనకు అవి కనబడవు, వినబడవు. ఢిల్లీ నేతలు, కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల సీఎంలు, నేతలు మన ఊర్లల్లోకి రాకపోవచ్చు.. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియనుంది. కాగా, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
Next Story






