Breaking: మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-31 06:23:51  IST  )

మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ..

Breaking: మున్సిపల్  చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ చట్ట సవరణ బిల్లు(Municipal Act Amendment Bill)కు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆమోదం తెలిపింది. ఆదివారం అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా బిల్లు అమలుకు సభ సభ్యులంతా ఆమోదం తెలిపారు. దీంతో మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad) సభ ముఖంగా పేర్కొన్నారు.

ఇక సభలో రిజర్వేషన్ల అంశంపైనా వాడీవేడీగా చర్చ సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత కేటీఆర్ సైతం చర్చించారు. అంతకుముందు రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి.

Next Story