తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 10 కీలక బిల్లులకు ఆమోదం!

by Kema Shiva Kumar |

సుదీర్ఘంగా సాగిన తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 10 కీలక బిల్లులకు ఆమోదం!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గత కొన్ని రోజులుగా వాడివేడిగా సాగిన సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రజా సమస్యలు, బడ్జెట్ కేటాయింపులు, రాష్ట్ర భవిష్యత్తుపై అధికార, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఈ సమావేశాలు ముగిశాయి. ఈ సెషన్‌లో అసెంబ్లీ మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు పని చేసింది. సభ్యులు వివిధ ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 10 ముఖ్యమైన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇవి రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనలో కీలక పాత్ర పోషించనున్నాయి.

రాష్ట్ర బడ్జెట్ వ్యయాలకు సంబంధించిన అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు (Appropriation Bill)కు సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ పథకాల అమలుకు మార్గం సుగమమైంది. సభ ముందుకు వచ్చిన బిల్లుల్లో ఓ బిల్లును ప్రభుత్వం సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది. ఆ బిల్లుపై మరింత లోతైన అధ్యయనం, సభ్యుల సూచనల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Next Story