- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti Vikramarka: ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణ: భట్టి విక్రమార్క
ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌పై దృష్టి పెట్టామని భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణను ఆవిష్కరణల కేంద్రంగా మార్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్యూర్, క్యూర్, రేర్‌గా రాష్ట్రాన్ని విభజించి ప్రణాళికలు చేపట్టామని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీలో రెండవరోజు గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం కోసం మూలధనం, ఉత్పాదకత పెంచడం అంశంపై జరిగిన చర్చలో భట్టి మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందున్నామని ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌పై దృష్టి పెట్టామన్నారు.
ప్రతిపక్షాలు విమర్శలు మాని సహకరించాలి:
అంతకు ముందు ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోందని ఇందులో అంశాల వారీగా ఒప్పందాలు జరుగుతున్నాయన్నారు. కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు మా విజన్ చూసి ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. పెట్టుబడులు రావడం నిరంతర పక్రియ అన్నారు. వచ్చిన పెట్టుబడులు రియాలిటీకి తీసుకురావడం మా ముందున్న లక్ష్యం అని నిన్న రెండు లక్షల కోట్ల కు పైగా పెట్టుబడులపై ఎంఓయూ జరిగిందన్నారు. ఇవాళ మరో రెండు లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూ జరగబోతోందని ప్రతిపక్షాలు విమర్శలు మాని సహకరించాలన్నారు. విమర్శలే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాలు ఉంటే ఏంలాభం ప్రశ్నించారు.






