వాటా కావాల్సిందేనని పట్టుబట్టిన తెలంగాణ

by Gantepaka Srikanth |

కృష్ణా జలాల వాటాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదం కొనసాగుతూనే ఉన్నది.

వాటా కావాల్సిందేనని పట్టుబట్టిన తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల వాటాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదం కొనసాగుతూనే ఉన్నది. అయితే.. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తూనే ఉన్నది. అందులో భాగంగానే కృష్ణా జలాల వివాదంపై కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్–2 (కేడబ్ల్యూడీటీ 2/బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్)లో వాదనలు కొనసాగుతున్నాయి. నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల గంపగుత్త కేటాయింపుల్లో రాష్ట్రాల వాటా తేల్చే అంశంపై ట్రిబ్యునల్‌లో ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిసిస్తున్నాయి. శుక్రవారం తెలంగాణ రాష్ట్రం తరఫున వినిపిస్తున్న వాదనలు ముగిశాయి. ముఖ్యంగా ట్రిబ్యునల్‌లో కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచడానికి వీలుగా జరుగుతున్న విచారణలో తెలంగాణకు 1,050 టీఎంసీల్లో 70 శాతం నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ అధికారులు కోరారు. అంతేకాకుండా ఇటీవల ఈ వాదనలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం హాజరయ్యారు. ముందు నుంచీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గానే తీసుకుంది. అందుకే బ్రిజేశ్‌ ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అటు సీఎం రేవంత్‌రెడ్డి, ఇటు ఉత్తమ్ సైతం అడ్వకేట్లను, అధికారులను ఆదేశించారు. కృష్ణా జలాల్లో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. అందులో భాగంగానే ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు బలమైన వాదనలు వినిపించారు. 70 శాతం నీటి వాటా కావాల్సిందేనని పట్టుబట్టారు. మరోవైపు.. ఏపీ తన వాదనలను వచ్చే నెల 29 నుంచి వినిపించనుంది.

Next Story