- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లో అలర్ట్..ఇవాళ ఈ జిల్లాల వారు జాగ్రత్త !
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో వడగాలులు తీవ్రంగా వేస్తాయని అంచనా వేసింది. అంతేకాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
అదే సమయంలో ఇవాళ ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మన్యం, అల్లూరి, పోలవరం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అటు శ్రీకాకుళంలోని ఆమదాల వలస, బూర్జ, హిరమండలం, కంచిలి, నందిగం, పాతపట్నం, సోంపేట మండలాల్లో ఎండ తీవ్రత, వడగాలులు ఉంటాయని తెలిపింది.
విజయనగరంలోని బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మ లక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట,పాలకొండ,సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాలలో ఎండ తీవ్రత ఉండునుంది.






