- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delimitation : డీలిమిటేషన్ పై తెలంగాణ అఖిలపక్ష సమావేశం
తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలు(Telangana Assembly Committee Hall)లో అఖిలపక్ష సమావేశం(All Party Meeting) ప్రారంభం అయింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలు(Telangana Assembly Committee Hall)లో అఖిలపక్ష సమావేశం(All Party Meeting) ప్రారంభం అయింది. కేంద్రప్రభుత్వం తీసుకు వస్తున్న జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన(Delimitation) అంశంపై రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ, ఆ పార్టీ మరో నాయకుడు జూలకంటి రంగారెడ్డి హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎవరూ హాజరు కాలేదు. అయితే ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశాల్లో డీలిమిటేషన్ విధానంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా హాజరు కావాలని పిలుపునిస్తూ భట్టి విక్రమార్క ఒ లేఖను విడుదల చేశారు.
జనాభా ప్రాతిపదికన జరగబోయే డీలిమిటేషన్ తో తెలంగాణ(Telangana)కు అన్యాయం జరగనుందని, జరగబోయే నష్టాన్ని గురించి అన్ని పార్టీలతో చర్చించి, ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని.. అందుకు గాను అన్ని పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరు కావాలని లేఖలో పేర్కొన్నారు. కాగా ఇటీవల దక్షిణాదిన డీలిమిటేషన్ విధానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తక్కువ జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానం వలన నష్టపోతాయని.. డీలిమిటేషన్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. కొనసాగించాలి అనుకుంటే 1971 జనాభా ప్రాతిపదికన తీసుకోవాలని ఇటీవల తమిళనాడు కేంద్రానికి తీర్మానం పంపిన విషయం తెలిసిందే.






