తెలంగాణ రైతులకు భారీ శుభవార్త.. వ్యవసాయ శాఖ సూపర్ ప్లాన్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో అన్నదాతలకు కూలీల కొరత తీరనుంది. ప్రభుత్వం జనవరిలో యాంత్రీకరణ పథకం ప్రవేశపెట్టేందుకు ప్లాన్​చేస్తోంది.

తెలంగాణ రైతులకు భారీ శుభవార్త.. వ్యవసాయ శాఖ సూపర్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అన్నదాతలకు కూలీల కొరత తీరనుంది. ప్రభుత్వం జనవరిలో యాంత్రీకరణ పథకం ప్రవేశపెట్టేందుకు ప్లాన్​చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతుల నుంచి కావాల్సిన పరికరాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించింది. వాటిని పరిశీలన చేసిన అర్హులైన 1.31 లక్షల మంది రైతులకు వివిధ రకాలు పనిముట్లు ఇవ్వనుంది. ఎస్టీ, ఎస్టీ మహిళా రైతులకు 50 శాతం, ఇతర వర్గాలకు 40 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో రూ. 101.83 కోట్లతో ఈ పథకం అమలు చేయనుంది. వీటికి సంబంధించిన ఖర్చులను కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించనున్నాయి. గతంలో పరికరాలను కొనుగోలు చేసి రాయితీపై పంపిణీ జరిగేంది. ఈసారి మార్పులు చేసి కొత్త విధానాలు తీసుకొస్తోంది. పరికరాలు తయారు చేసే 16 కంపెనీలను గుర్తించి ఎం ప్యానెల్​చేర్చింది. వాటి నుంచి రైతులు కొనుగోలు చేయాలి. రాయితీ కంపెనీలకు ప్రభుత్వం అందజేస్తుంది. పంపిణీ చేసిన పరికరాలు వ్యవసాయ శాఖ అధికారులు ఐదేళ్ల పాటు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయనుంది. లక్ష కంటే విలువైన యంత్రాలకు జియో ట్యాంగ్​వేస్తారు. ఇతర పరికరాలకు ఏఐ ఆధారిత టెలిమాటిక్స్​కిట్​ఏర్పాటు చేస్తారు. దీంతో యంత్రం అసలు ఉందా, ఎంత పనిచేసిందో గుర్తించవచ్చు.

యంత్రాలు తీసుకునేందుకు రైతులు ఆసక్తి :

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాల కోసం 5.50 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దశల వారీగా అవసరమైన వారికి పరికరాల పంపిణీ జరుగుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. ప్రభుత్వం నూతన సంవత్సరం కానుకగా అందజేస్తే ఈ రబీ సీజన్‌లో ఇతర రాష్ట్రాల నుంచి కూలీల కష్టపడి తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. తక్కువ కూలీలు అవసరం ఉండటంతో స్థానికంగా కూలీలతో పనులు పూర్తి చేయవచ్చు. 8 సంవత్సరాల క్రితం కేసీఆర్​ప్రభుత్వం యాంత్రీకరణ పథకం రద్దు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చిన తరువాత యాంత్రీకరణ పథకం పునరుద్దరణ నిర్ణయం తీసుకుంది. యువత ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా వ్యవసాయం వైపు అడుగులు వేసేలా చేస్తుంది. మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని రైతులకు అవగాహన చేసిన పరికరాలు తీసుకోవాలని ప్రచారం చేపట్టారు. దీంతో రెండు ఎకరాలపై ఉన్న అన్నదాతలంతా యంత్ర పరికరాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు తమకు యంత్రాలు ఇప్పించాలని స్ధానిక ఎమ్మెల్యేలను కోరుతున్నారు.

యాంత్రీకరణతో రైతులకు ఆదాయం :

సాగులో పెట్టుబడి ఖర్చులను తగ్గించి రైతుల ఆదాయం పెరిగేందుకు యంత్రాల అందజేత పథకానికి రైతుల నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రభుత్వం రాయితీపై అందించే వ్యవసాయ పనిముట్లు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉండటంతో పాటు సాగులో కూలీల కొరతను అధిగమించవచ్చు. ఈ రాయితీ పథకానికి ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులు అర్హులు. ఈ పథకం కింద విత్తనాలు చల్లే యంత్రాలు, కోతకోసే యంత్రాలు, స్పేయర్లు, ట్రాక్టర్లతో నడిచే రోటోవేటర్లు, ప్లౌ, ట్రాలీ, సీడర్, కలుపు తీసే యంత్రాలు, పవర్​ట్రిల్లర్లు, స్ట్రాబాలర్లు, బండ్​ఫార్మర్​వంటి 15 రకాల యంత్రాలకు రాయితీ ఇస్తోంది.

లబ్దిదారుల గుర్తింపుకు కమిటీలు :

సబ్సిడీ యంత్రాలను అందించేందుకు అర్హులైన రైతులను ఎంపిక చేసేందుకు త్వరలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. మండల స్థాయి కమిటీలో వ్యవసాయ అధికారి, తహశీల్దార్, ఎంపీడీవో ఉంటారు. సబ్సిడీ రూ. లక్ష దాటితే జిల్లా కమిటీ అనుమతి తప్పనిసరి. జిల్లాస్థాయి కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, కన్వీనర్‌గా డీఏవో, ఆగ్రోస్ ఆర్‌ఎం, ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త, లీడ్​బ్యాంక్​ఆఫీసర్​సభ్యులుగా ఉంటారు. లబ్దిదారుల ఎంపికలో రాజకీయ పైరవీలకు తావులేకుండా పథకం అమలు చేస్తారు.

Next Story