- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టోనీ బ్లెయిర్ సంస్థతో తెలంగాణ ఒప్పందం
బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్(British Former PM Tony Blair) తో నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Utham Kumar Reddy) భేటీ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్(British Former PM Tony Blair) తో నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Utham Kumar Reddy) భేటీ అయ్యారు. న్యూ ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ రైసింగ్-2047(Telangana Rising-2047)’ విజన్ డాక్యుమెంట్, రాష్ట్ర అభివృద్ధి చర్యలు, సుస్థిర అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి అంశాలపై టోనీ బ్లెయిర్ తో చర్చించారు.
2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో రూపొందిన ఈ విజన్.. కోర్ అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ జోన్‌లలో పేదల సంక్షేమం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పారదర్శక పాలనపై దృష్టి సారిస్తుందని రేవంత్ తెలిపారు. ఐటీ, ఫార్మా, ఆరోగ్యం, విద్య, పునరుత్పాదక శక్తి రంగాలలో 16 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించారు.
తొమ్మిది ఐటీ టవర్లు, T-ఫైబర్ ద్వారా డిజిటల్ ఇన్‌క్లూజన్, 40 గిగావాట్ల పునరుత్పాదక శక్తి, 1000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ముసీ రివర్‌ఫ్రంట్ పునరుజ్జీవనం, కుల గణన, 42% బీసీ రిజర్వేషన్ వంటి ప్రభుత్వ చర్యలను వెల్లడించారు. సుస్థిర నిబంధనల ఆధారంగా అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ ఈ దిశగా సాగుతున్నందుకు బ్లెయిర్ హర్షం వ్యక్తం చేశారు. AI, స్పోర్ట్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్, ఫార్మా హబ్‌లతో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలపై బ్లెయిర్ ఆసక్తి చూపించారు. TBI ద్వారా తెలంగాణకు సాంకేతిక సలహాలు, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అందిస్తామని హామీ ఇచ్చారు.






