- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping: తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లు ట్యాప్.. సిట్‌కు ఐక్యవేదిక సంచలన లేఖ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో సంచలన విషయం చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Phone Tapping Case) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో సంచలన విషయం చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్, బీజేపీ నేతలతో ప్రముఖులు దాదాపు 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లును సైతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్య వేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)కు లేఖ రాసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి తెలిపారు. ఆ సమయంలో హారీశ్‌రావు నివాసానికి పిలిపించి.. మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో మాకు తెలుసు.. అని బెదిరించారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్‌లో 500 మందితో నామినేషన్ వేసే కార్యక్రమం చేపట్టిన సమయంలో తనది, ఉద్యమకారుల ఫోన్లు ట్యాపింగ్ చేసి అక్రమ కేసులు బనాయించారని, నామినేషన్‌లు పూర్తి అయ్యే వరకు మమ్ములను నానా చిత్ర హింసలు పెట్టారని ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తమ ఫోన్ ట్యాప్ చేశారని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట నియోజక వర్గాల్లో 200 చొప్పున నామినేషన్లు వేయడానికి నిర్ణయం తీసుకుంటే.. నామినేషన్లు వేయడానికి వస్తున్న తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబ సభ్యులను నామినేషన్లు వేయకుండా భయపెట్టించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాప్ చేసి పౌరుల హక్కులను హరించినందుకు మాజీ సీఎం కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) వారి అనుచరులను అరెస్ట్ చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి.. బాధితులకు న్యాయం జరిగేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. దర్యాప్తు విజయవంతమైన తర్వాత నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిట్‌ను కోరారు.






