ఆ ఏసీబీ వాళ్లను నమ్మకండి.. తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో సంచలన ట్వీట్

by Sujitha Rachapalli |

ప్రజలను అలర్ట్ చేస్తూ తెలంగాణ ఏసీబీ నోట్ రిలీజ్ చేసింది. ఏసీబీ అధికారుల పేరుతో వస్తున్న ఫేక్ కాల్స్ నమ్మకూడదని.. మోసపోకూడదని సూచించింది. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారుల పేరుతో గవర్నమెంట్ ఉద్యోగులకు బెదిరింపు కాల్స్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని..

ఆ ఏసీబీ వాళ్లను నమ్మకండి.. తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రజలను అలర్ట్ చేస్తూ తెలంగాణ ఏసీబీ నోట్ రిలీజ్ చేసింది. ఏసీబీ అధికారుల పేరుతో వస్తున్న ఫేక్ కాల్స్ నమ్మకూడదని.. మోసపోకూడదని సూచించింది. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారుల పేరుతో గవర్నమెంట్ ఉద్యోగులకు బెదిరింపు కాల్స్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. ఇలాంటి ఫాల్స్ కేసులు అవాయిడ్ చేయాలని సూచించారు. స్కామ్‌లో ఇరుక్కుని బాధితుడిగా మారకూడదన్నారు. ఏసీబీ ఎప్పుడూ పబ్లిక్ సర్వెంట్స్‌కు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయదని.. కేసులు రిజస్టర్ చేస్తామని, మనీ ఇస్తే కేసు రిమూవ్ చేస్తామని చెప్పదన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా లంచం అడగడం నేరమని.. ఇలాటి కాల్స్ వస్తే తమకు సమాచారం అందించాలన్నారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106, ఫేస్ బుక్ TELANGANA ACB, ట్విట్టర్ @TELANGANAACBకి రిపోర్ట్ చేయాలన్నారు.

LINK

Next Story