- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana:10th విద్యార్థులకు అలర్ట్..రిజల్ట్స్ డేట్ ఫిక్స్..? ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఎప్రిల్ 29న ఫలితాలను విడుదల చేయగా ఈ ఏడాది ఎప్రిల్ 30న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. మూల్యాంకణ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతులమీదుగా ఫలితాలు విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా మెమోలలో మార్కులు ఇవ్వకుండా కేవలం గ్రేడ్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుండి మార్కులు సైతం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి అత్యధిక మార్కులు వచ్చాయో తెలుసుకోవడం కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
-అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in ను సందర్శించండి.
-హోమ్ పేజీలో 'TS SSC Result 2025 లింక్ పై క్లిక్ చేయండి.
-మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి.
-తరవాత అవసరమైన వివరాలు ఎంటర్ చేయండి.
-మీ మార్కుల వివరాల ప్రింటౌట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.






