- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SLBC: ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కారణం కేసీఆర్.. ఎమ్మెల్సీ మల్లన్న కీలక వ్యాఖ్యలు
ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటనను బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్ఎల్‌బీసీ (SLBC) ప్రమాద ఘటనను బీఆర్ఎస్ పార్టీ (BRS) రాజకీయం చేస్తోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తాజాగా తన లైవ్ చానల్‌లో మాట్లాడారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద నేనే కుర్చి వేసుకోని కూర్చుంటా.. ఎవడు ఆపుతాడో చూస్తా.. టన్నెల్ పూర్తి చేసి శ్రీశైలం నుంచి నీళ్లు తెస్తా.. అని, 2014 నల్గొండ ఎన్‌జీ కాలేజీలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ మీటింగ్‌లో (KCR) కేసీఆర్ మాట్లాడారని గుర్తుకు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
మీరు ప్రాజెక్టు పనిచేసుంటే ఈ ప్రమాదం జరగకపోయేదని అభిప్రాయపడ్డారు. ఈ నిర్లక్ష్యం వల్లనే ఎస్ఎల్‌బీసీ ప్రమాదానికి మాజీ సీఎం కేసీఆర్ కారణం అయ్యారని ఆరోపించారు. గత పదేండ్లలో ఎస్‌ఎల్‌బీసీని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కానీ నేడు ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికి గురైన వ్యక్తులను రక్షించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ - ఎస్ఎల్బీసీ) సొరంగంలో శనివారం భారీ ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలు కాగా.. 8 మంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బలగాలు తీవ్ర కృషి చేస్తున్నాయి.






