KBR పార్కు పేరు మార్చాలి - తీన్మార్ మల్లన్న

by velandi.Saikiran |

తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబీఆర్ పార్క్ పేరు మార్చాలని డిమాండ్ చేశా

KBR పార్కు పేరు మార్చాలి - తీన్మార్ మల్లన్న
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబీఆర్ పార్క్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు తీన్మార్ మల్లన్న. వెంటనే కాసు బ్రహ్మానందరెడ్డి పేరుకు బదులు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని... కొత్త చర్చ తెరపైకి తీసుకువచ్చారు తీన్మార్ మల్లన్న. తాజాగా కేబీఆర్ పార్కు వద్ద తీన్మార్ మల్లన్న, కొంతమంది బీసీ నాయకులు... నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడారు. కేబీఆర్ పార్కు పేరును తొలగించి వెంటనే ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టకపోతే.. ఆ పని మేమే చేస్తామని డిమాండ్ చేశారు. వెంటనే కేబీఆర్ పార్క్ ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని (Professor Jayashankar's statue ) కూడా పెట్టాలన్నారు.

బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి (Kasu Brahmananda Reddy ) విగ్రహాన్ని జెసిబి లతో పెకిలించి అవతల పాడేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెడతామని స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna). కేబీఆర్ పార్క్ ( KBR PARK)ఒక్కటే కాదు.. హైదరాబాదులో ఉన్న అన్ని పార్కులకు తెలంగాణ ఉద్యమకారుల పేర్లు... పెట్టాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్స్ , హోటల్స్, ఏరియాల పేర్లు కూడా మార్చాలన్నారు తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.

Next Story