సాంకేతికత, శిక్షణ, ప్రజా విశ్వాసం తెలంగాణ పోలీస్ అజెండా : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

​రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, పౌర భద్రతకు సంబంధించి కీలక మార్పులు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.

సాంకేతికత, శిక్షణ, ప్రజా విశ్వాసం తెలంగాణ పోలీస్ అజెండా : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ​రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, పౌర భద్రతకు సంబంధించి కీలక మార్పులు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. ఆధునికీకరణ, సాంకేతికతను స్వీకరించడం, కొత్త తరహా నేరాలను ఎదుర్కోవడం ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలని తెలిపారు. హైదరాబాద్‌లోని 77 ఆర్ఆర్ బ్యాచ్‌కు చెందిన నలుగురు ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు అయాషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, మనీషా నెహ్రా, రాహుల్ కాంత్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీస్ విధానం పై దిశా నిర్ధేశం చేశారు. పౌరులతో మెరుగైన సంభాషణ విశ్వాసం కోసం అధికారులు తెలుగు భాషలో ప్రావీణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. దీని ద్వారా బలమైన గ్రాస్ రూట్స్ అనుసంధానం సాధ్యమవుతుందని తెలిపారు.

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలు, ఉగ్రవాద సంబంధిత దర్యాప్తులలో నైపుణ్యాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆధునిక సవాళ్లకు హైదరాబాద్ ఒక హాట్‌స్పాట్‌గా ఉందని తెలిపారు. స్పెషలిస్ట్ శిక్షణ సాంకేతిక స్వీకరణ డిజిటల్ ఫోరెన్సిక్స్, మాల్వేర్ విశ్లేషణ, సైబర్ దర్యాప్తులలో సూచనలు చేశారు . ఏఐ, డ్రోన్ టెక్నాలజీ పద్ధతులను అవలంబించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సెషన్‌కు తెలంగాణ పోలీస్ అకాడమీ (టిజిపిఎ) డైరెక్టర్ అభిలాషా బిష్ట్, సహా సీనియర్ అధికారులు హాజరయ్యారు.

Next Story