ఆగస్టులో టెక్నికల్ టీటీసీ పరీక్షలు

by velandi.Saikiran |

రానున్న ఆగస్టు నెలలో టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆగస్టులో టెక్నికల్ టీటీసీ పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న ఆగస్టు నెలలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ (టీటీసీ) లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 6 ప్రధాన జిల్లాలైన హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్ కేంద్రాలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాల్లో 42 రోజుల టీటీసీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో పాటు, గతంలో ఫెయిల్ అయిన పాత బ్యాచ్ అభ్యర్థులు కూడా ఈ పరీక్షలు రాసేందుకు అర్హులు.

అర్హులైన అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తులను సంబంధిత టీటీసీ ట్రెయినింగ్ కోర్సు ఇన్-ఛార్జ్ ద్వారా పూర్తి చేసి, అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌లపై కోర్సు ఇన్-ఛార్జ్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులు కోర్సు ఇన్-ఛార్జ్‌కు ఫీజు చెల్లించడానికి ఈ నెల 11 వరకు అవకాశం కల్పించారు. సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు జమ చేయడానికి ఈ నెల 12 వరకు, రూ. 50 లేట్ ఫీజుతో ఈ నెల 18 వరకు అవకాశం కల్పించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు తమ పరిధిలోని డీఈఓ కార్యాలయాన్ని లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

Next Story