- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్రటేరియట్‌లో QR కోడ్ ఎంట్రీ.. 24గంటల్లోనే టెక్నికల్ సమస్యలు
తెలంగాణ సెక్రటేరియట్ ఎంట్రీ క్యూఆర్ కోడ్‌కు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. స్కానింగ్ రూల్ ప్రారంభించిన 24 గంటలకే టెక్నికల్ సమస్య మొదలైంది. క్యూఆర్ కోడ్ ఇచ్చేందుకు ఓటీపీ రాకపోవడంతో క్యూఆర్ కోడ్ ఎంట్రీని ప్రభుత్వం నిలిపివేసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సెక్రటేరియట్ ఎంట్రీ క్యూఆర్ కోడ్‌కు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. స్కానింగ్ రూల్ ప్రారంభించిన 24 గంటలకే టెక్నికల్ సమస్య మొదలైంది. క్యూఆర్ కోడ్ ఇచ్చేందుకు ఓటీపీ రాకపోవడంతో క్యూఆర్ కోడ్ ఎంట్రీని ప్రభుత్వం నిలిపివేసింది. వెంటనే సమస్యను పరిష్కరించాలని మీసేవను ఆదేశించింది. కాగా సచివాలయంలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం ఇటీవల క్యూఆర్ కోడ్ ఎంట్రీని తీసుకురావాలని నిర్ణయించింది. అపరిచితులు, మోసగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు క్యూఆర్ కోడ్ ఎంట్రీ ఉపయోగపడుతుందని భావించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సెక్రటేరియట్‌లోకి రావాలంటే మంత్రులు, అధికారులకు సంబంధించిన పేషీలు ఇవ్వగానే విజిటర్ మొబైల్ ఫోన్‌కు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ మెసేజ్ రూపంలో వస్తుంది. గేట్ దగ్గర ఉంటే ఎస్‌పీఎఫ్ సెక్యురిటీ సిబ్బంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తరవాత లోపలికి అనుమతిస్తారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టెక్నాలజీని గురువారం ప్రవేశపెట్టగా మరుసటి రోజే టెక్నికల్ సమస్యలు తలెత్తడం షాకింగ్‌గా మారింది.






